newjerusalemministries.com

పేద నరుని రూపము ధరించి
యేసు రాజు నీ చెంత నిలచె
అంగీకరించు-మాయనను (2)       ||పేద నరుని||

కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడెన్
ముళ్ల మకుటము శిరస్సున పెట్టబడెన్ (2)
నింద వేదన శ్రమలను సహించెనేసు
చిందే తనదు రక్తము నీ పాపముకై
దీనుడై నిన్ను పిలచుచుండె (2)       ||పేద నరుని||

తల వాల్చుటకు ఇల స్థలమే లేదు
దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు (2)
తన్ను ఆదరించు వారెవరు లేరు
ప్రియ రక్షకుడు సిలువలో వ్రేలాడే
పాట్లుపడే నిన్ను విడిపింపను (2)       ||పేద నరుని||

ప్రభు సాతాను తలను చితుక ద్రొక్కెన్
పాప డాగులన్ రక్తముతో కడిగెన్ (2)
నీ వ్యాధిని వేదన తొలగించ
నీ శాపము నుండి విడిపింప
సిలువలో విజయము పొందే (2)       ||పేద నరుని||

మాయ లోకమును నీవు నమ్మకుము
మనుష్యుల మనస్సు మారిపోవునిల (2)
నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు
నిశ్చయముగా ప్రభువులో ఆనందింప
నేడే రమ్ము విశ్వాసముతో (2)       ||పేద నరుని||

తామసించెదవేల ఓ ప్రియుడా
ప్రియ యేసుని యొద్దకు లేచి రమ్ము (2)
ఈ లోకము నీకివ్వని శాంతిని
ఈ దినమే ప్రభువు నీకొసగ
ప్రేమతో నిన్ను పిలచుచుండె (2)       ||పేద నరుని||

Pedha Naruni Roopamu Dharinchi
Yesu Raaju Nee Chentha Nilache
Angeekarinchu-maayananu (2)       ||Pedha Naruni||

Kaalla Chethulandu Seelal Kottabaden
Mulla Makutamu Shirassuna Pettabaden (2)
Ninda Vedana Shramalanu Sahinchenesu
Chinde Thanadu Rakthamu Nee Paapamukai
Deenudai Ninnu Pilachuchunde (2)       ||Pedha Naruni||

Thala Vaalchutaku Ila Sthalame Ledu
Dappi Theerchukona Neeru Dorakaledu (2)
Thannu Aadarinchu Vaarevaru Leru
Priya Rakshakudu Siluvalo Vrelaade
Paatlupade Ninnu Vidipimpanu (2)       ||Pedha Naruni||

Prabhu Saathaanu Thalanu Chithuka Drokken
Paapa Daagulan Rakthamutho Kadigen (2)
Nee Vyaadhini Vedhana Tholagincha
Nee Shaapamu Nundi Vidipimpa
Siluvalo Vijayamu Pondhe (2)       ||Pedha Naruni||

Maaya Lokamunu Neevu Nammakumu
Manushyula Manassu Maaripovunila (2)
Nithya Devuni Premanu Nammi Neevu
Nischayamugaa Prabhuvulo Aanandimpa
Nede Rammu Vishwaasamutho (2)       ||Pedha Naruni||

Thaamasinchedhavela O Priyudaa
Priya Yesuni Yoddaku Lechi Rammu (2)
Ee Lokamu Neekivvani Shaanthini
Ee Diname Prabhuvu Neekosaga
Prematho Ninnu Pilachuchunde (2)       ||Pedha Naruni||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *