1 కొరింథి 4 : 20 దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తి తోనే యున్నది.
రోమీయులకు 14 : 17 “దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును, పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది.”
నిత్యజీవప్రధాతయైన దేవుని వాక్యం యొక్క శక్తి నిరంతరము గొప్పది మరియు ఘనమైనది. ఆ ఘనమైన దేవుని వాక్యమును ప్రబలముగా నమ్మి, యేసుక్రీస్తు నందు ఒకరినొకరు అపోస్తులుల బోధ. ప్రార్థన, ప్రేమ, విశ్వాసం, విధేయత మరియు కరుణతో కొనసాగించుచున్నాము. ఈ పరిచర్యకు ప్రజలు యేసుక్రీస్తు ప్రభులవారి సువార్త యొక్క శుభవార్త వినడానికి స్వచ్ఛందంగా వస్తారు, వారి పాపాలను ఒప్పుకొని మరియు నీతియు సమాధానమును, పరిశుద్ధాత్మయందలి ఆనందమును అనుభవించి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఈ పరిచర్య చాలా కొద్ది మంది ఆత్మలతో ప్రారంభించబడి, దేవుని దయతో మరియు ఆయన మీద ప్రగాఢమైన విశ్వాసముతో నడపబడుతున్న ఈ పరిచర్యకు ప్రతి ఆదివారం ప్రజలు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభులవారిని ఆరాధించడానికి మందిరమునకు వేగిరపడుచున్నారు. ఈ పరిచర్యకు (FCRA ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ లేదు) విదేశీ నిధులు లేవు. ఇది పూర్తిగా 100% భారతీయ మరియు స్వదేశీ పరిచర్య.