newjerusalemministries.com

మనము దేవుని పిల్లలము / Manamu Devuni Pillalamu

మనము దేవుని పిల్లలము విలువ కలిగిన బాలలము చేరి కొలుతుము ప్రస్తుతింతుము యేసుప్రభుని మేలులకై                   ॥మన॥ 1. ఐదు రొట్టెలు రెండు చేపలు యేసుకిచ్చిన బాలుడను జైలు నుండి పేతురొచ్చిన సంగతి తెలిపిన బాలికను యెరూషలేము నగరు కొరకై చెక్కబడిన గుమ్మములం 2. యేసుస్వామి ఎత్తుకొని ముద్దాడిన ప్రియ బాలుడను కుష్టరోగి నయమానుకు శుభవార్త తెలిపిన బాలికను దైవ దీవెనలందు ఎదిగే దేవదేవుని దీపములం