మన మధ్యనే ఉన్నది / Mana Madhyane Unnadi
సిద్ధపడుము – దేవుని సేవకై (సీయోను పిల్లల పాటలు) Siddhapadumu Devuni Sevakai
…నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు… యెషయా 42:1 సిద్ధపడుము – దేవుని సేవకై (2) నిన్నేర్పరచుకొనె – దేవుడు (1) నీతో నిలిచి – నీకు తోడైయుండున్-లేచి నడువుము దేవునితో (2)
దేవుని గృహంబులో సాత్వికుడెవరో తెలుసా?(సీయోను పిల్లల పాటలు)/ Devuni Gruhamlo Saathwikudevaro Thelusaa
మోషే… క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని,… హెబ్రీ 11:24,26 దేవుని గృహంబులో సాత్వికుడెవరో తెలుసా? దేవునికై ధన, ఘనతలను విడనాడినదెవరో తెలుసా?(2) క్రీస్తుకై అవమానమున్ – క్రీస్తులో బహుమానముల్ (2) కోరినదాసుడు మోషే – కృపనొందిన దీనుడు మోషే (2) Repeat first 2 lines
సిలువలో బలి అయిన / Siluvalo Bali Aina
నీ జీవితం నీటీ బుడగా / Nee Jeevitham Neeti Budaga
మనము దేవుని పిల్లలము / Manamu Devuni Pillalamu
మనము దేవుని పిల్లలము విలువ కలిగిన బాలలము చేరి కొలుతుము ప్రస్తుతింతుము యేసుప్రభుని మేలులకై ॥మన॥ 1. ఐదు రొట్టెలు రెండు చేపలు యేసుకిచ్చిన బాలుడను జైలు నుండి పేతురొచ్చిన సంగతి తెలిపిన బాలికను యెరూషలేము నగరు కొరకై చెక్కబడిన గుమ్మములం 2. యేసుస్వామి ఎత్తుకొని ముద్దాడిన ప్రియ బాలుడను కుష్టరోగి నయమానుకు శుభవార్త తెలిపిన బాలికను దైవ దీవెనలందు ఎదిగే దేవదేవుని దీపములం
దేవుని పిల్లలం / Devuni Pillalam
దేవుని పిల్లలం మనమేసుని వారసులం (2) ఎన్నడు మమ్ము విడువడు ఏనాడు మమ్ము ఎడబాయడు (2) 1. భూమ్యాకాశములు సృజించిన దేవుడు ఆకాశ పక్షులను పోషించు నా దేవుడు నన్ను చేరదీయును నన్ను కూడ పోషించును ॥దేవు॥ 2. విశ్వాసమే నా బలము అపజయం నాకు లేదు యేసు నాతో ఉన్నారు. ఇక భయమే నాకు లేదు క్రీస్తు నాలో ఉన్నారు ఇక దిగులే నాకు లేదు ॥దేవు॥
దేవుని పనికై కానుకలీయుమా / Devuni Panikai Kaanukaleeyumaa
దేవుని పనికై కానుకలీయుమా ఆయనిచ్చు మేళ్ళు పొందుమా నీవిచ్చినది కొంచెమైనను నీ ఫలములు విస్తారములగును 1. విధవరాలు ఇచ్చినవి రెండు కాసులైనను తన జీవనమంతయు ఇచ్చివేసెను నీవిచ్చినది కొంచెమైనను నీ ఫలములు విస్తారములగును 2. మాసిదోనియ సంఘస్థులు బీదలైనను బహు దాతృత్వము కలిగి ప్రభునకిచ్చిరి నీవిచ్చినది కొంచెమైనను నీ ఫలములు విస్తారములగును
దేవుని మార్గములో / Devuni Maargamulo
దేవుని మార్గములో ముందుకు సాగుదమా యేసే ఆ మార్గమని జనులకు చాటుదమా 1. రక్తం కార్చి ప్రాణం పోసి సిద్ధము చేసినది శిక్ష బాపి రక్షణిచ్చే నీతి మార్గమది 2. ఇరుకైన మార్గమది పరముకు చేర్చునది పరీక్షల మార్గమది నిరీక్షణిచ్చునది