అరిచే నెమలికి తెలుసా / Ariche Nemaliki Thelusaa
1. అరిచే నెమలికి తెలుసా ఎగిరే లేడికి తెలుసా ఆ అందం యేసు ఇచ్చిందేనని 2. కూసే పక్షికి తెలుసా రాసే కవితకు తెలుసా ఆ మధురిమ యేసు ఇచ్చిందేనని 3. పూసే పువ్వుకు తెలుసా తడిసిన మట్టికి తెలుసా ఆ పరిమళం యేసు ఇచ్చిందేనని 4. అందం కంటే గొప్పది మకరందం కంటే గొప్పది సువాసన కంటే గొప్పది యేసు ఇచ్చే రక్షణ స్వీకరిస్తావా ఆస్వాదిస్తావా