newjerusalemministries.com

యుద్ధము యెహోవాదే ||4||

రాజులు మనకెవ్వరు లేరు
శూరులు మనకెవ్వరు లేరు ||2||
సైన్యములకు అధిపతి అయినా
యెహోవా మన అండ ||యుద్ధము||

బాధలు మనలను కృంగదీయవు
వ్యాధులు మనలను పడద్రోయవు ||2||
విశ్వాసమునకు కర్త అయినా
యేసయ్యే మన అండ ||యుద్ధము||

ఎరికో గోడలు ముందున్నా
ఎర్ర సముద్రము ఎదురైనా ||2||
అద్బుత దేవుడు మనకుండా
భయమేల మనకింకా ||యుద్ధము||

అపవాది అయిన సాతాను
గర్జించు సింహంవలె వచ్చినా ||2||
యూదా గోత్రపు సింహమైనా
యేసయ్య మన అండ ||యుద్ధము||Posted on 16-Oct-2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *