యేసూ నీ సృష్టి ఎంత అద్భుతం
ప్రభూ నీ ప్రేమ ఎంతో మధురం
కొండ లోయలు ఎడారులు
సెలయేరు నదులు సంద్రములు
పక్షులు వృక్షాలు ఫలపుష్పాలు
జలచర జంతుజాల గని ఖనిజాలు
నీ చేతులతో నన్ను నిర్మించావు
నీ చేతులు చాచి పిలచుచున్నావు
నాకై నీ సమస్తము ఇచ్చావు
నీకై నేనేమి ఇవ్వగలను