ఆయన… మన పాపములను మ్రానుమీద మోసికొనెను. 1 పేతురు 2:24
పల్లవి : యేసు చావొందే సిలువ పై – నీ కొరకే నా కొరకే (1)
ఎంత గొప్ప శ్రమ నోర్చెను – నీ కొరకే నా కొరకే (2)
1. నదివలె యేసు రక్తము – సిలువలో నుండి ప్రవహించే (2)
పాపము కడిగె మలినము తుడిచే (2) ఆ ప్రశస్త రక్తమే (1) ॥యేసు॥
2. నేడే నీ పాపము ఒప్పుకో – నీ పాపడాగులు తుడుచుకో (1)
నీ ఆత్మ తనువుల శుద్ధిపరచుకో(2) క్రీస్తు యేసు రక్తములో (1) ॥యేసు॥
3. పాపశిక్ష పొంద తగియుంటిమి – మన శిక్ష ప్రభువే సహించెను
నలుగగొట్టబడె పొడువబడె నీకై – అంగీకరించు యేసుని ॥యేసు॥