నీ సన్నిధిలో ఈ ఆరాధనను
స్వీకరించుము నా ప్రభువా (2)
నా హృదయములో నీ ఆత్మ బలమును
నింపుము నాపై యేసయ్యా ||నీ సన్నిధిలో||
ఆవిరివంటి వాడను నేను
మేఘ స్తంభమై నిలిచావు (2)
చల్లని నీ ప్రేమ గాలిని సోకించి (2)
వర్షముగా నను మార్చావు – మార్చావు ||నీ సన్నిధిలో||
మోడులా మిగిలిన నాకై
సిలువ మ్రానిపై వ్రేళాడి (2)
నీ రక్తముతో నను ప్రోక్షించి (2)
నా మరణ శాపం తొలగించావు – తొలగించావు ||నీ సన్నిధిలో||
Nee Sannidhilo Ee Aaraadhananu
Sweekarinchumu Naa Prabhuvaa (2)
Naa Hrudayamulo Nee Aathma Balamunu
Nimpumu Naapai Yesayyaa ||Nee Sannidhilo||
Aavirivanti Vaadanu Nenu
Megha Sthamabhamai Nilichaavu (2)
Challani Nee Prema Gaalini Sokinchi (2)
Varshamugaa Nanu Maarchaavu – Maarchaavu ||Nee Sannidhilo||
Modulaa Migilina Naakai
Siluva Mraanipai Vrelaadi (2)
Nee Rakthamutho Nanu Prokshinchi (2)
Naa Marana Shaapam Tholaginchaavu – Tholaginchaavu ||Nee Sannidhilo||