నీ కృప చాలునయా యేసయ్యా నా యేసయ్యా
నీ మేలునే కోరితి మెస్సయ్యా నను కాయువాడా
స్తుతి ఘనత మహిమ నిరతము నీకే చెల్లును
నన్నెంతగానో ప్రేమించి నీవు నీ చేతిలో నను చెక్కుకుంటివి
నా సహవాసం నీతో నుండను నీ రూపులో నను చేసుకొంటివి
ఇంతటి భాగ్యము పొందుటకు ఎంతటి వాడను నేను ప్రభు ||నీ కృప||
పడియున్న నన్ను చెడనియ్యకా నీ జీవము నాలో నుంచినావు
పరిశుద్ధ రక్తం నాకై కార్చి నీ దివ్య రక్షణ నిచ్చినావు
నన్నాదరించిన నజరేయుడా నిన్నేన్నడు నేను మరువనయ ||నీ కృప||
నలిగిన హృదయం విరిగిన మనసుతో నీ నామ గానం చేసెద (యేసయ్య)
నీ మధుర స్వరం ప్రతి దినం నే వినుచు ఆస్వాదించెద
చాలునయా నాకీ జీవితం నీ సేవకే అది అంకితం ||నీ కృప||
Nee Krupa Chaalunayaa Yesayyaa Naa Yesayyaa
Nee Melune Korithi Messayyaa Nanu Kaayuvaadaa
Sthuthi Ghanatha Mahima Nirathamu Neeke Chellunu
Nannenthagaano Preminchi Neevu Nee Chethilo Nanu Chekkukuntivi
Naa Sahavaasam Neetho Nundanu Nee Roopulo Nanu Chesukontivi
Inthati Bhaagyamu Pondutaku Enthati Vaadanu NenU Prabhu ||Nee Krupa||
Padiyunna Nannu Chedaniyyakaa Nee Jeevamu Naalo Nunchinaavu
Parishuddha Raktham Naakai Kaarchi Nee Divya Rakshana Nichchinaavu
Nannadarinchina Najareyudaa Ninnennadu Nenu Maruvanayaa ||Nee Krupa||
Naligina Hrudayam Virigina Manasutho Nee Naamam Gaanam Cheseda (Yesayyaa)
Nee Madhura Swaram Prathi Dinam Ne Vinuchu Aaswaadincheda
Chaalunayaa Naakee Jeevitham Nee Sevake Adi Ankitham ||Nee Krupa||