నా స్నేహం యేసుతోనే
నా గమ్యం క్రీస్తులోనే
నా తల్లిదండ్రులు నన్ను విడిచిన
యేసు నన్ను విడువడు
నా హితులందరు నన్ను మరచిన
యేసు నన్ను మరువడు
1. జగతికి రూపము లేనప్పుడు
నను సృజియించెను
పిండముగా నేనున్నప్పుడు
నను ఏర్పరచెను
చేయి పట్టి నడిపే దేవుడుండగా
భయమిక నన్ను చేరదు
తన కంటిపాపల నన్ను కాయును
శ్రమయు నన్నేమి చేయదు
2. నా ప్రభు అరచేతిలో నేను
చెక్కబడియుంటిని
తన కరముల నీడలో నిలచి
స్తోత్రము చేయుదును
నేను చేయు స్తుతుల మూలముగా
ఒక దుర్గమును స్థాపించెను
ఆయువు మొదలు జీవితాంతము
చంకనెత్తుకును ప్రియప్రభువే