పాట రచయిత: జాన్ వెస్లీ
Lyricist: John Wesley
నశియించెడి లోకంలో – వసియించవు కలకాలం
మేలైనది చేపట్టి – సాగించు నీ పయనం – (2)
అది నాదంటూ ఇది నాదంటూ – ఆనందం కోల్పోతూ
పరమార్ధం గ్రహియించకనే – గతియించిపోతావా ||నశియించెడి||
కాలంతో పాటుగా కృశియించును శరీరం
మరణం కబళించును ఏ ఘడియలోనైనా (2)
క్రీస్తు దారిలో సాగి – నిత్య రాజ్యమే చేరి (2)
వసియించు కలకాలం – సత్యమైన లోకంలో ||నశియించెడి||
నిలచిపోవును మహిలోన బంధాలన్ని
మట్టిలో కలియును దేహం రిక్త హస్తాలతో (2)
ఇకనైనా తేరుకొని – గ్రహియించు సత్యాన్ని (2)
యేసులోకి మళ్ళించు – నీ జీవిత గమనాన్ని ||నశియించెడి||
పాట రచయిత: జాన్ వెస్లీ
Lyricist: John Wesley
Nashiyinchedi Lokamlo – Vasiyinchavu Kala Kaalam
Melainadi Chepatti – Saaginchu Nee Payanam – (2)
Adi Naadantu Idi Naadantu – Aanandam Kolpothu
Paramaardham Grahiyinchakane – Gathiyinchipothaavaa ||Nashiyinchedi||
Kaalamtho Paatugaa Krushiyinchunu Shareeram
Maranam Kabalinchunu Ae Ghadiyalonainaa (2)
Kreesthu Daarilo Saagi – Nithya Raajyame Cheri (2)
Vasiyinchu Kala Kaalam – Sathyamaina Lokamlo ||Nashiyinchedi||
Nilachipovunu Mahilona Bandhaalanni
Mattilo Kaliyunu Deham Riktha Hasthaalatho (2)
Ikanaina Therukoni – Grahiyinchu Sathyaanni (2)
Yesuloki Mallinchu – Nee Jeevitha Gamanaanni ||Nashiyinchedi||