దేవుని పిల్లలం
మనమేసుని వారసులం (2)
ఎన్నడు మమ్ము విడువడు
ఏనాడు మమ్ము ఎడబాయడు (2)
1. భూమ్యాకాశములు సృజించిన దేవుడు
ఆకాశ పక్షులను పోషించు నా దేవుడు
నన్ను చేరదీయును
నన్ను కూడ పోషించును ॥దేవు॥
2. విశ్వాసమే నా బలము
అపజయం నాకు లేదు
యేసు నాతో ఉన్నారు.
ఇక భయమే నాకు లేదు
క్రీస్తు నాలో ఉన్నారు
ఇక దిగులే నాకు లేదు ॥దేవు॥