newjerusalemministries.com

క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి
కొన్నట్టి సంఘమున
ఎవరు చేరెదరో వారే ధన్యులు
పరలోకము వారిది (2)      ||క్రీస్తేసు||

అపొస్తలుల బోధను నమ్మి
స్థిరపరచబడిన వారే (2)
ఆత్మ శక్తితో వారు ఎల్లప్పుడు
సంఘములో నిలిచెదరు (2)      ||క్రీస్తేసు||

పరిశుద్ధులతో సహవాసమును
ఎవరు కలిగియుందురో (2)
వారే పొందెదరు క్షేమాభివృద్ధి
క్రీస్తేసు ప్రభువు నందు (2)      ||క్రీస్తేసు||

ప్రభు దేహ రక్తమును తిని త్రాగు వారే
తన యందు నిలిచెదరు (2)
ప్రకటించెదరు ఆయన మరణ
పునరుత్తానమును వారు (2)      ||క్రీస్తేసు||

పట్టు వదలక సంఘముతో కూడి
ఎవరు ప్రార్ధించెదరో (2)
ప్రార్ధన ద్వారా సాతాను క్రియలు
బంధించెదరు వారే (2)      ||క్రీస్తేసు||

క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు
ఎవరెదురు చూచెదరో (2)
నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు
సర్వ లోకము నందు (2)      ||క్రీస్తేసు||

Kreesthesu Prabhuvu Thana Rakthamichchi
Konnatti Sanghamuna
Yevaru Cheredaro Vaare Dhanyulu
Paralokame Vaaridi (2)        ||Kreesthesu||

Aposthalula Bodhanu Nammi
Sthiraparachabadina Vaare (2)
Aathma Shakthitho Vaaru Yellappudu
Sanghamulo Nilichedaru (2)        ||Kreesthesu||

Parishuddhulatho Sahavaasamunu
Evaru Kaligiyunduro (2)
Vaare Pondedaru Kshemaabhivruddhi
Kreesthesu Prabhuvu Nandu (2)        ||Kreesthesu||

Prabhu Deha Rakthamunu Thini Thraagu Vaare
Thana YanduNilichedaru (2)
Prakatinchedaru Aayana Marana
Punarutthaanamunu Vaaru (2)        ||Kreesthesu||

Pattu Vadalaka Sanghamutho Koodi
Evaru Praardhinchedaro (2)
Praardhana Dwaaraa Saathaanu Kriyalu
Bandhinchedaru Vaare (2)        ||Kreesthesu||

Kreesthesu Prabhuni Raakada Koraku
Evareduru Choochedaro (2)
Nithyaanandamutho Saakshyamichchedaru
Sarva Lokamu Nandu (2)        ||Kreesthesu||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *