మేమే మేమే యేసుక్రీస్తు బిడ్డలం / Meme Meme Yesu Kreesthu Biddalam
మేమే మేమే యేసుక్రీస్తు బిడ్డలం మేమే మేమే క్రీస్తుకు ప్రియ వారసులం పువ్వులం దివ్వెలం బలిపీఠపు గువ్వలం 1 ఐదువేల మందికి సంతృప్తిని ఇచ్చిన యేసు విరచి ఇచ్చినట్టి ఐదు రొట్టె చేపలం ఐదు రొట్టెలం రెండు చిన్ని చేపలం 2. కానా విందులో ఆత్మ దాహమును తీర్చిన యేసు ఆశీర్వదించినట్టి రాతి బానలం ఆరు రాతి బానలం
శక్తిగల యేసుక్రీస్తు నామంలో / Shakthigala Yesukreesthu Namamulo
శక్తిగల యేసుక్రీస్తు నామంలో జయము పొందుతాను నేను అన్నిటిలో అ.ప: యేసులో నిలిస్తే గొప్పజయం యేసుతో నడిస్తే లేదు భయం ॥శక్తి॥ 1. బలశాలి గొల్యాతును చిన్న రాయితో పడగొట్టెను దావీదు దైవబలముతో దేవునిపై ఉంచెదను విశ్వాసం దేవుని కర్పించెదను నా జీవితం ॥యేసు॥ 2. లెక్కలేని శత్రువులను కొద్దిమందితో గెలిచినాడు యెహోషువ ప్రార్ధనాత్మతో ప్రార్ధనతో గెలిచెదను సమస్తం లోకంలో నిలిచెదను ప్రభుకోసం ॥యేసు॥