చిన్ని చిన్ని పిల్లల్లారా మీరందరూ / Chinni Chinni Pillalaara Meerandaru
చిన్ని చిన్ని పిల్లల్లారా మీరందరూ దేవుని స్తుతింప రండి ఆయన మేలులన్ మరవకను మహిమపరచ రండి యేసుని మహిమపరచ రండి. 1. భూమి కంటే ఆకాశము ఎంతో ఉన్నతము భయభక్తులుగల వారిపై ఆయన కృప ఎంతో అధికం 2. మనము మంటి వారము అడవి పువ్వులము అయినను మన తండ్రి ఎంతో జాలి చూపించును
పిల్లలారా చిన్న పిల్లలారా / Pillalaara Chinna Pillalaara
పిల్లలారా చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు సాతానుతో వద్దు వద్దు పొత్తు 1. దేవుని మార్గము వెలుగు సాతాను మార్గము చీకటి వెలుగు బాటలో నడవండి తారలై ఇల వెలగండి 2. దేవుని రాజ్యము మీదే రమ్యమైన రాజ్యము జీవజలములు త్రాగుదురు. జీవ ఫలములు తిందురు
చిన్న పిల్లలారా / Chinna Pillalaara
చిన్న పిల్లలారా చివరి సమయమిదేరా యేసు వచ్చు వేళరా ఎదురు చుద్దాంరా 1. యేసయ్యను నమ్మండి యేసయ్యలో ఉండండి యేసులోనే ఎదగండి యేసుతోనే నడవండి 2. గురుతులెన్నో చెప్పాడు షరతులెన్నో ఇచ్చాడు మరువద్దని అన్నాడు మన యేసు దేవుడు 3. క్రీస్తువలె ఉంటాడు క్రీస్తు విరోధి వస్తాడు క్రీస్తులానే చేస్తాడు క్రీస్తు అతడు కాడు