newjerusalemministries.com

పడవలో యేసుస్వామి పయనమాయెను / Padavalo Yesu Swami Payanamayenu

పడవలో యేసుస్వామి పయనమాయెను కడలిలో ఆ చిన్నదోనె సాగుచుండెను 1. ఆదమరచి యేసుస్వామి నిదురపోయెను అంతలోనే కారుమబ్బు కమ్మివేసెను హోరునగాలి – జోరున వాన పెళ పెళమని ఉరుములు పైకి లేచె అలలు శిష్యులందరికి గుండెలదిరిపోయెను యేసుపైన విశ్వాసం సడలిపోయెను 2. యేసు స్వామి లేచి శిష్యులను చూచి అల్పవిశ్వాసులార భయమేలని అడిగి గాలి సముద్రమును గద్దించెను ప్రకృతి ఆ మాట విని నిమ్మళించెను శిష్యులందరికి ఆశ్చర్యమాయెను యేసుపైన విశ్వాసం సడలిపోయెను