పాపుల కోసం ప్రాణం పెట్టిన / Paapula kosam Praanam Pettina
పాపుల కోసం ప్రాణం పెట్టిన యేసుకు దండాలు ప్రార్ధన మాకు నేర్పిన దేవా నీకే స్తోత్రాలు పాపులమయ్యా దయ చేయి దండిగ దీవెనలు పిల్లలమయ్యా పేదలమయ్యా విను మా ప్రార్ధనలు 1. కల్లాకపటం ఎరగని మమ్ము రక్షించాలయ్యా పిల్లలమైన మాపై నీ దయ కురింపించాలయ్యా ఎల్లప్పుడు నువు నీ కనుసన్నలో మేముండాలయ్యా చల్లగ చూసి మము కాపాడే దైవం నీవయ్యా