బాలలం భావిలో నేతలం / Balalam Bhavilo Nethalam
బాలలం భావిలో నేతలం పిల్లలం ప్రేమవనం మల్లెలం పుడమిపై బంగారు కొమ్మలం ప్రగతిని సాధించే పౌరులం మేమే యేసుక్రీస్తు పిల్లలం క్రీస్తు ప్రేమ పంచే పరిచారకులం బాలలం 1 విజ్ఞాన సంద్రములో చిరు నావికులం విజయాల ఖడ్గంలో వింత తారలం క్రీస్తులో మేము పసిడి కాంతి రేఖలం సంఘములో వికసించే మొగ్గలం బాలలం 2. రోజు రోజుకు పెరిగే చిన్నారులం సండేస్కూల్లో మేమంతా ఒకే కుటుంబం దైవభక్తి దైవశక్తి గలవారలం తే ధైర్యంగా సాగిపోయే ధీరులం బాలలం