నాకు ముందుగా యేసు ఉన్నాడు / Naaku Mundugaa Yesuunnadu
నాకు ముందుగా యేసు ఉన్నాడు. నేను వెళ్ళు త్రోవ ఆయన ఎరిగియున్నాడు. నా క్షేమం కోరువాడు నాకు దారిచూపు వాడు నన్ను నడిపించువాడు యేసు దేవుడు 1. అందని మహకొండలైనా అంధకార లోయలైనా ఎంతమాత్రం నా చేయి విడువనని చెప్పినాడు కొంచెమైనా నా కాలు జారనీయుడు 2. బెదిరించే ఎండలైనా వణికించె చలులైనా ఎంతదూరం నడవగలనో తానే ఎరిగి యున్నాడు అంతకంటే నన్ను అలసిపోనీయడు