నిజముగా మొరపెట్టినా / Nijamugaa Mora Pettina
నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా జీవముగల దేవుడు మౌనముగా ఉండునా తన పిల్లలకాయన మేలుచేయకుండునా 1. పరలోక తండ్రినడిగినా మంచి యీవులియ్యకుండునా కరములెత్తి ప్రార్ధించినా దీవెనలే కురియకుండునా ॥జీవ॥ 2. సృష్టికర్తయైన వానికి మన అక్కర తెలియకుండునా సరియైన సమయానికి దయచేయక ఊరుకుండునా ॥జీవ॥