తొందరపడకే చిన్ని హృదయమా / Thondara Padake Chinni Hrudayamaa
తొందరపడకే చిన్ని హృదయమా ధైర్యము వీడక నిలిచియుండుమా 1. నీకు కలుగు కష్టములో దేవునితోడు ఉండునులే మహిమ గలిగిన క్రీస్తే నిన్ను చిటికెలో విడిపించునులే 2. చిక్కు తెచ్చు సమస్యలలో దేవుడు నీ వెంటుండునులే జ్ఞానియైన యేసే నీకు జవాబును చూపించునులే