దేవుడే దావీదు దుర్గము / Devude Daaveedu Durgamu
దేవుడే దావీదు దుర్గము ధైర్యమే దావీదు బలము ఆపద ఏదైనా శత్రువు ఎవరైనా దేవుని శక్తితో గెలిచెను ఓ.. ఓ… ఓ… ఓ… ఓహోహో (4) 1. సింహమొచ్చెను తోక ముడిచెను ఎలుగుబంటి పరుగు తీసెను గొల్యాతు వచ్చెను విర్రవీగెను దావీదు చేతిలో చచ్చెన ॥ఓ॥ 2. దేవుని ఆజ్ఞకు లోబడెను దేవునికిష్టునిగా బ్రతికెను దేవుడు మెచ్చెను ఆశీర్వదించెను దావీదు రాజుగా చేసెను ॥ఓ॥