ముద్దులొలికే చిన్ని నోటితో / Muddu Lolike Chinni Notitho
ముద్దులొలికే చిన్ని నోటితో మృదువైన పెదవులతో అబద్ధాలు చెప్పొద్దు నిజమే చెప్పాలి. 1. అబద్ధమాడిన గేహజి కుష్ఠ రోగి అయినాడు అననీయ సప్పిరా చచ్చిపోయారు. అబద్ధాలు నేర్పే వాడు. మన విరోధి సాతానే అబద్దమాడిన వారు అగ్నిగుండములో పడతారు ॥ముద్దు॥ 2. సత్యమంటే యేసయ్యే సత్యసాక్షి అయ్యాడు సత్యమునే చెప్పాడు సిలువపై మరణించాడు. ప్రాణం పోతున్నాగాని నిజమే చెప్పాలి. దేవుని మెప్పును కోరాలి జీవకిరీటం పొందాలి ॥ముద్దు॥