newjerusalemministries.com

చిన్నారి చుక్కలము / Chinnari Chukkalamu

చిన్నారి చుక్కలము సిరిమల్లె పువ్వులము చల్లనైన యేసయ్య ఒడిలో చక్కగా కూర్చుందుము ॥చిన్నా॥ 1. జీవముండెను యేసులో జీవమే జీవపు వెలుగు నీతి సూర్యుడు నిజమైన వెలుగు నిన్ను నన్ను వెలిగించును ॥చిన్నా॥ 2. చీకటి జీవితం వదిలెదము వెలుగు బాటలో నడిచెదము యేసే వెలుగని చాటెదము వెలుగును అందరికి పంచెదము ॥చిన్నా॥

చిన్నారి పాప విన్నావా / Chinnari Papa Vinnava

చిన్నారి పాప విన్నావా చిన్నారి బాబు విన్నావా విశ్వాసముంటే కృపతో నీవు రక్షింపబడతావని ఇది దేవుని వరమేనని(2) ॥చిన్నా॥ 1. మారుమూలలో నివసించే మెఫీబొషెతువలె నీవుంటే (2) మేడ గదులలో నివసింప దేవుని కృపనే పొందితివి మహా దేవుని కరుణను పొందితివి

చిన్నారి పాపలం మేము / Chinnari Papalam Memu

చిన్నారి పాపలం మేము చిన్నారి బాబులం మేము యేసయ్య ఒడిలో కూర్చుండెదము యేసయ్య మాటలే నేర్చుకుందుము 1. లోకము పాపము మాకొద్దు ఆ యేసు ప్రభువే మాకు చాలు (2) ఆ జీవ వాక్యమే మాకు మేలు (2) 2 ప్రార్ధనా వాక్యము మాకు చాలు సాతాను మాటలు మాకొద్దు (2) సాతాను పాటలే మాకొద్దు (2)

చిట్టి చేతులతో చిన్నారి పాప / Chitti Chethulatho Chinnari Papa

చిట్టి చేతులతో చిన్నారి పాప బుడి బుడి నడకలతో ముద్దోచ్చే బాబు వింటావా యేసుని స్వరము వింటావా తీస్తావా తీస్తావా యేసుకు తలుపు తీస్తావా 1. మంచుకు తడిసిన తలతో గాయం పొందిన చేతితో తలుపు తట్టగా ప్రేమతో పిలవగా రమ్మని తలుపు తీస్తావా

చిన్నారి నా జీవితం / Chinnari Naa Jeevitham

చిన్నారి నా జీవితం యేసయ్య బహుమానం నా నోటి ప్రతిగీతం యేసయ్య నామ గానం 1. నా ప్రతి విషయములో ఆయనకే ప్రధమ స్థానం నా పరలోక తండ్రికి నేనంటే ఎంతో ప్రాణం   ॥చిన్నా॥