newjerusalemministries.com

సంతోషం సంతోషం / Santhosham Santhosham

సంతోషం సంతోషం యేసయ్య మనలో ఉంటే సంతోషం సంతోషం 1. మన పాపం దూరమైతే సంతోషం సంతోషం యేసు ప్రభువు తోడుంటే సంతోషం సంతోషం 2. యేసు ప్రభుని నమ్మితే సంతోషం సంతోషం పరలోకం చేరితే సంతోషం సంతోషం

సండేస్కూలంటే మాకిష్టం / Sunday Schoolante Maa Kistam

సండేస్కూలంటే మాకిష్టం వన్డే మ్యాచ్‌ అయిన మానేస్తాం వానైన ఎండైన కానీ వరదైన బురదైన కానీ వుయ్‌ షల్‌ గో నన్‌ కెన్‌ స్టాప్‌ అజ్‌ సండేస్కూల్‌ సండేస్కూల్‌ వుయ్‌ లవ్‌ యు సండేస్కూల్‌ (2) 1. ఎన్నెన్నో సాంగ్స్‌ ఉంటాయ్‌ ఎన్నెన్నో స్టోరీస్‌ ఉంటాయ్‌ ఎన్నెన్నో గేమ్స్‌ ఉంటాయ్‌ ఎన్నెన్నో డ్రామాస్‌ ఉంటాయ్‌ 2. బాల్యంలో ప్రభువును ఎరిగుంటే బలమైన భావి ఉంటుంది బాల్యంలో బైబిల్‌ చదివుంటే బైబిల్‌ మన భారం మోస్తుంది

సునో సునో సుంకరి ప్రార్ధన /Suno Suno Sunkari Pradhana

సునో సునో సుంకరి ప్రార్ధన దేఖో దేఖో దీన ప్రార్ధన తగ్గించుకున్న ఈ ప్రార్ధన దేవునికి ఇష్టమైన ప్రార్ధన కన్నులెత్తి ఆకశంబు వైపు చూడ ధైర్యము చాల లేదు పాపినైన నన్ను కనికరించమనుచు సుంకరి ప్రార్ధించెను తగ్గించుకున్న ఈ ప్రార్ధన దేవునికి ఇష్టమైన ప్రార్ధన

సాతానా నీకు అపవాది నీకు / Sataana Neeku Apavaadi Neeku

సాతానా నీకు అపవాది నీకు కొమ్ములే కాదు తోక కూడ ఉందిలే నీ బుద్ది నాకు తెలుసు నీ కుట్రలు తెలుసు నీతో చెలిమేలా నీకు నాకు స్నేహమా పో సాతానా పో.. పో.. పో.. దగ్గరకు రావద్దు పో 1. యేసే నా మిత్రుడు యేసే నా రక్షకుడు యేసే విమోచకుడు నా ప్రభు యేసే లాలలల లాల్ల లాల్ల లాల్ల (3)

స్తోత్రము స్తోత్రము స్తోత్రము / Srothramu Srothramu Srothramu

స్తోత్రము స్తోత్రము ప్రోత్రము మహిమ ఘనత ప్రభావము యేసు రాజుకే చెల్లును ఆయనకే చెల్లింతును 1. భూమి ఆకసం సముద్రము జలములు పొలములు పైరులు వన వృక్షములు ఆయన మహిమను వివరించును ఆయన సన్నిధిని సంతసించును 2. సూర్యచంద్రులు ఆకాశ పక్షులు అడవి జంతువులు జలచరాదులు. ఆయన మహిమను వివరించును ఆయన సన్నిధిని సంతసించును

సాగిపోవుచున్నది దీర్ఘయాత్ర / Saagipovuchunnadi Deergha yaatra

సాగిపోవుచున్నది దీర్ఘయాత్ర కనానులోనికి ఆ మంచి భూమికి అ.ప: ముందుకే పయనము వెనుకకు తిరిగి చూడము యెహోవా తోడుండ భయము లేదుగా 1. ఆకలైన వేళలో మన్నా కురిపించును దాహమైన వేళలో బండ పొర్లి పారును    ॥ముందు॥ 2. అడ్డగించు సంద్రము పాయలుగా చీలును తరిమికొట్టు సైన్యము నాశనమై పోవును                           ॥ముందు॥

సమస్త దేవతల కంటే / Samastha Devathala Kante

సమస్త దేవతల కంటే మన ప్రభువు గొప్పవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి ఉన్నతుడు యెహోవా దయాళుడు స్తుతులకు పాత్రుడు ప్రధాన యాజకుడు చాలిన దేవుడు