ఒకటి రెండు మూడు / Okati Rendu Moodu
ఒకటి రెండు మూడు ఆ యేసు వైపు చూడు నాలుగు ఐదు ఆరు బహు జోరుగా పాడు అ.ప: నిరీక్షణ అనుక్షణం యేసులోనే ఉంచు దీక్షతో సాగుతూ పరీక్షలో నెగ్గు 1. ఏడు ఎనిమిది తొమ్మిది ఆ యేసుతో ఉంటే నెమ్మది యేసుని సన్నిధి సంతోషానికి పెన్నిధి
ఒంటరినై యున్నానని / ontarinai unnanani
ఒంటరినై యున్నానని తోడెవ్వరు లేరేయని దిగులుతో నీవున్నావా నిరాశ పడుతున్నావా 1. యేసయ్య మంచి స్నేహితుడు నీ కొరకు వేచియున్నాడు ఆయన చెంతకు చేరుమా పరమానందము పొందుమా 2. యేసయ్య మంచి దేవుడు నీ కొరకు ప్రాణమిచ్చాడు. ఆయన శరణం వేడుమా రక్షణ భాగ్యము పొందుమా