newjerusalemministries.com

విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి… మత్తయి 13:18

పల్లవి : విత్తనాలు విత్తుటకు విత్తువాడు బయలుదేరెను        (2)

అవి విత్తుచుండగా కొన్ని త్రోవ ప్రక్క పడెను             (2)

పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసెను                                (2)

1.మరికొన్ని విత్తనాలు – రాతినేల మీద పడెను         (2)

    వాటిలో వేరు లేనందున – అవి ఎండిపోయెను      (2)      ॥విత్త॥

2. మరికొన్ని విత్తనాలు – ముండ్లపొదలలోన పడెను

    ముండ్ల పొదలు ఎదిగి – వాటి నణచి వేసెను                        ॥విత్త॥

3. మరికొన్ని విత్తనాలు – మంచి నేల మీద పడెను

    ముప్ప – దరువదంతల్ – నూరంతలు ఫలియించెన్          ॥విత్త॥

4. వాక్యమును విని, గ్రహించి – దాని ననుసరించువారు

    సఫలులై ప్రభు యేసులో – బహుగా ఫలించెదరు                ॥విత్త॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *