…యేసుక్రీస్తు అనుగ్రహించు… జ్ఞానమందును అభివృద్ధిపొందుడి. 2 పేతురు 3:18
పల్లవి : మాటలు లేని పుస్తకాన్ని మరువకండి పిల్లలు(2)
మనసార ధ్యానించుడి రంగులలోన నన్ను(2)
1.బంగారం – పరలోకమునకు గురుతు
పిల్లల్లాంటి వారిదే పరలోకమనే ప్రభువు(2) ॥మాట॥
2. నలుపు – పాపమునకు గురుతు
పాపము వలన జీతము మరణము ॥మాట॥
3. ఎరుపు – యేసు రక్తమునకు గురుతు
ప్రతి పాపము నుండి – పవిత్రులుగా చేయును॥మాట॥
4. తెలుపు – పరిశుద్ధతకు గురుతు
హృదయ శుద్ధి కలవారే – దేవుని చూచెదరు॥మాట॥
5. ఆకుపచ్చ – ఎదుగుదలకు గురుతు
వాక్యము ధ్యానించి – ఎదుగుదము రారండి॥మాట॥