newjerusalemministries.com

…ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు… యోహాను 3:3

పల్లవి : పరలోక రాజ్యం చేరాలంటే – తిరిగి నీవు జన్మించాలి (1)

ప్రభువుతో నిత్యం ఉండాలంటే – ప్రతి తప్పు ఒప్పుకోవాలి (1)

ప్రతి తప్పు ఒప్పుకోవాలి (1)

1. నజరేయునికి అవిధేయునిగా – జీవించే గదా ఆ సౌలు (2)

    ప్రార్థించువారిని బాధించుతానని – పరుగులు తీసేగా ప్రతిరోజు (1)

    పరుగులు తీసేగా ప్రతిరోజు (1)                                                                 ॥పర॥

2. దేవుని పిల్లల దారుణ హింసకు – తెగించే గదా ఆ సౌలు

    దేవుని సేనగా భ్రమించి వడిగా – పరుగులు తీసే అశ్వాలు

    పరుగులు తీసే అశ్వాలు                                                                              ॥పర॥

3. దమస్కు మార్గం తేజరిల్లగా – పరలోక వెలుగులో మధ్యాహ్నం

    సౌలా సౌలా నన్నిలా ఏలా – హింసింతు-వనెను ప్రభుని స్వరం

    పరిశుద్ధుని చేసెను అదే క్షణం                                                   ॥పర॥

4. ప్రభుని ఎరుగక సేవించిన అది పాపమౌనని తెలిసికొను

    యేసుని వేడిన జ్ఞానమిచ్చును – వాక్యము నమ్ముము ఈ క్షణమే

    అది మార్చును నిన్ను ప్రతిక్షణము                                                              ॥పర॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *