…క్రీస్తు …మృతిపొందెను,… మూడవదినమున లేపబడెను. 1 కొరింథి 15:3,4
పల్లవి : చిన్న పిల్లలారా రారండి – యేసు రాజువైపు చూడండి(1)
ప్రేమించి మీకై జగతికొచ్చెను-రక్షింప మిమ్ము పిలుచుచుండెను(2)
చిన్న పిల్లలారా రారండి (1)
1. సిలువలో మీకై మరణించెను – మృతిని గెల్చి మీకై తిరిగిలేచెను (2)
మరల వచ్చి మిమ్ము కొనిపోవును ॥చిన్న॥
2. పాప మొప్పుకో యేసు కరుణించును
సిలువ రక్తముతో – క్రీస్తు శుద్ధి చేయును
ఎంతగానో మిమ్ము దీవించును ॥చిన్న॥
3. నిన్ను ఆశీర్వదించి గొప్ప చేయును
నిన్ను గొప్ప జనముగా – తానే చేయును
నిశ్చయముగా నిన్ను దీవించును ॥చిన్న॥