దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఆది 21:17
పల్లవి : చిన్న బిడ్డ నేనయ్యా – చేర్చుకొను యేసయ్యా (1)
నా ప్రార్థన వినుమయ్యా (2)
1. పాపిని నన్ను చూడుమయ్యా-పాపము మన్నించుమయ్యా (2)
నా ప్రార్థన వినుమయ్యా(2) ॥చిన్న॥
2. శత్రువును జయించను శక్తియు, బలము నాకునిమ్ము
బాలుడను కాపాడుము(2) ॥చిన్న॥
3. పిల్లలందరు ఎరుగునట్లు – భువి యందు సాక్ష్యమిచ్చెదను(2)
నీ పాదములను పూజింతును (2) ॥చిన్న॥
4. అర్చించుకొందు నీకొరకై – ఆశతో నీ సేవ చేయుటకై (2)
ఆత్మతో నన్ను నింపుమయ్యా (2) ॥చిన్న॥