newjerusalemministries.com

…చిన్నబిడ్డలను నాయొద్దకు రానియ్యుడి… మార్కు 10:14

1. రారండి చిన్న పిల్లల్లారా-మన ప్రియ యేసుతో మాట్లాడను(2)

పల్లవి : కలసి రండి కలసి రండి-మన ప్రియ యేసుతో మాట్లాడను (2)

2. ప్రేమతో యేసు పిలుచుచుండె వాద్యములతో పాడుచు వెళ్లెదం(2)       ॥కలసి॥

3. బైబిలు యేసునకు ప్రియము-బాగుగా దానిని వినెదము(2)                 ॥కలసి॥

4. యేసెన్నడు కలహించలేదు-మనమెవ్వరితో కలహించరాదు(2)           ॥కలసి॥

5. అన్న వస్త్రములను మాతపితా-సోదరి సోదరుల నిచ్చెన్ (2)                ॥కలసి॥

6. ప్రియ యేసు తెచ్చెను మనకొరకై చూడుము ఎన్నో దీవెనలు (2) ॥కలసి॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *