..నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము… యెహోషువ 24:15
పల్లవి : నేను కోరుకొన్నాను – నేను నా యింటివారున్(2)
యెహోవాను సేవించెదము – యేసుక్రీస్తు ప్రభునే (2)
1. పాడెదను దావీదు కుమారునికి – మండుచున్న కోపము ఎదురైనను (2)
హోసన్నయని మందిరములో – కేకలతో ప్రభునే ఘనపరచెదన్ (2) ॥నే॥
2. అర్పించుకొందు నా సమస్తమున్ – అలసట ఆకలి మరి యేదైనను
రొట్టెలు చేపల నిచ్చిన – చిన్న వానిబోలి నే నర్పింతును ॥నే॥
3. సాక్ష్యమిచ్చెదన్ ప్రతిచోటను – చెరలోనైన చిన్నతనమైనను
సిరియ దేశములో సాక్షిగా – నిలిచిన చిన్నదానిని బోలి ॥నే॥
4. సమూయేలు వలె నేనారాధింతును – యెహోవా స్వరము నే విందును
యెహోవా దాసుడను నేను – ఆయన ఆజ్ఞనే నాలకింతున్ ॥నే॥