…నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము … యెహోషువ 24:15
పల్లవి : నేను నాయింటి వారందరు – ప్రభువునే సేవింతుము (1)
నీవును సేవింతువా? నీవును సేవింతువా? (2)
1. ప్రభువునే సేవించుట – సరికాదని తలచినచో (2)
ఎవరిని సేవించుటనునది – ఈ దినమే తీర్మానించు (2) ॥నేను॥
2. బానిసలమైన మనల – దేవుడే విడిపించెను
అద్భుతముల మనయెడల చేసినట్టి – ప్రభువునే సేవింతువా? ॥నేను॥
3. మన మార్గములో కాపాడియు – ప్రభువే నడిపించెను
ప్రభువిచ్చి నాశీర్వాదముల చూచి – కృతజ్ఞతన్ సేవింతువా? ॥నేను॥
4. అన్ని మంచి ఈవులెల్ల – దేవాది దేవుడిచ్చిన్
లోబడి ఆయన సర్వము వినుచు – సాక్షిగా జీవింతువా? ॥నేను॥