…మీ నిమిత్తము దరిద్రుడాయెను. 2 కొరింథీ 8:9
పల్లవి : రాజుల రాజా యేసు – ప్రభువుల ప్రభువా! (1)
పశువుల తొట్టిలో – శిశువుగ నైతివా!
ముక్తి దాతా యేసువా!
రాజుల రాజ యేసు (1)
1. మన నిమిత్తమే – దరిద్రుడాయే ప్రభూ
కౄర సిల్వనెక్కి – రక్తము కార్చి బాధించబడెను ప్రభూ (2)
దేవా! దేవా! నన్నేల విడిచితివని అరచి ప్రాణమిడెను (1)
తిరిగి జీవితుడై పరమునకేగి సింహాసనాసీనుడాయె (2) ॥రాజు॥
2. పిల్లలారా! మీరందరు – విశ్వాసముంచుడి యేసు పై
పాప క్షమాపణ పొందు మీ దినమే – నూతన జీవమొసగున్
నీదు హృదయములో నివసింపవచ్చున్ సృష్టికర్త యేసుడు
నీ జీవమునకు రాజుగ తానై నిన్ను కొనిపోవవచ్చును ॥రాజు॥