1. చిన్ని చిన్ని అడుగులు
చర్చిలోకి వేతును
చక్కగా కూర్చుందును
చిక్కను సాతానుకు
అడుగులన్ని యేసయ్యకు తెలియును
అలసిన వేళలో తానే నడుపును
అదురు లేక బెదురు లేక
ముందుకే నడుతును
2. చిన్ని చిన్ని పలుకులు
ప్రతి దినము పలుకుతాం
యేసయ్య పలుకులు
పది మందికి తెలుపుతాం
పలుకులన్ని యేసయ్యకు తెలియును
అలసిన వేళలో తానే నడుపును
అదురు లేక బెదురు లేక
ముందుకే సాగెదన్