పాట పాడనా ప్రభువు పాట పాడనా
ఏలాగు పాడను ఏమని పాడను
1. ఎందరికో మేలు చేసిన చేతులలో
అందరి యొద్దకు నడచిన పాదములలో
మెత్తనైన పాదములలో మేకులు
మృదువైన చేతులలో చీలలు
ముఖము పై ఉమ్మి వేయబడినదా
శిరముపై ముండ్ల మకుటమున్నదా
ప్రేమ పంచిన యేసు హృదయము
పగులగా కారెను రక్తము
నా కొరకై పొందెనే శ్రమలన్నియు
నన్ను ప్రేమతో క్షమించి రక్షించెను