చిన్ని చిన్ని పిల్లలం చిన్నారి పిల్లలం
యేసునాధునికే ముద్దు బిడ్డలం మేము
యేసునాధునికే ముద్దు బిడ్డలం ?చిన్ని?
1. బాల్యదినములందే
యేసు ప్రభువుని నమ్ముకొని
బైబిల్ మాటలు బాలలకు నేర్పెదం
బడిలో గుడిలోన
మాదిరిగా మసలుకొని
అమ్మ నాన్నలకు
మంచి పేరు తెచ్చెదం ॥చిన్ని॥
2. పరమును వీడి ధరకరుదెంచినాడు
సిలవలోనిలచి ప్రాణమర్పించినాడు
మూడవ దినమున
మృతిని గెల్చి లేచినాడు
పరమునకరుదెంచి
త్వరగా రానెయుండె ॥చిన్ని॥