మంచి కాపరి యేసే
సిలువలో ప్రాణమిచ్చెను
గొప్ప కాపరి ఆయనే
సమాధి గెలిచి లేచెను
ప్రధాన కాపరిగా వచ్చును
పరలోకములో చేర్చును ॥మంచి॥
1. తప్పిన చిన్న గొట్టెను
తెచ్చెను స్వంతము చేసెను
నా పేరు యేసు పిలుచును
నా ముందు తానే నడచును ॥మంచి॥
2. దొంగ సాతానుకు చిక్కను
దేవుని చేతిలో చెక్కెను
యేసే నా ప్రియ కాపరి
ఆయనే అందరి ఉపకారి ॥మంచి॥