రారా ఓ తమ్ముడా
రావేఓ చెల్లెలా
సండేస్కూలుకు పరుగున రారండి
1. సండేస్కూల్లో పాటలు ఉంటాయిరా
యేసయ్య మాటలు నేర్పుతారురా
బైబిల్లో కధలెన్నో చెబుతారురా
ఆనందం ఆనందం సంతోషమే
2. మాట్లాడే బొమ్మలు చూపిస్తారురా
చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తారురా
ఆటల పోటీలెన్నో పెడతారుగా
స్కిట్స్ గిఫ్ట్స్ కూడా ఉంటాయిరా