రెప రెప లాడె పతాకం
గుస గుస లాడె చిరు గాలి (2)
మిల మిల మెరిసె కెరటాలు
బిర బిర సాగే సెలయేరు (2)
చెప్పేదొకటే చెల్లెమ్మ
చెప్పేదొకటే తమ్మయ్యా (2)
జయము మనదే (2)
యేసులో విజయం మనదే
బిర బిర సాగిపో
మిల మిల మెరిసిపో
గుస గుస ప్రార్ధించు
రెప రెప జయించు
జయము మనదే
యేసులో విజయం మనదే