ఇసుక మీద ఇల్లు కట్టకు
అది కూలిపోతుంది (2)
వాన కురిసి వరద వస్తే
గాలి తోడై విసిరి కొడితే (2)
మాట వినని వాని ఇల్లు
కూలిపోయెను
లోబడని వాని
ఇల్లు కూలిపోయెను
వాని సొగసైన ఇల్లు కూలిపోయెను
1. బండ మీద ఇల్లు కట్టుకో
అది స్థిరముగా ఉంటుంది(2)
వాన కురిసి వరద వస్తే
గాలి తోడై విసిరి కొడితే (2)
మాట వినిని వాని ఇల్లు ధీటుగుండెను
లోబడిని వాని ఇల్లు మేటిగుండెను
వాని సొగసైన ఇల్లు నిలిచియుండెను
2. జోరు వాన హోరు గాలి వరదపోటు
ఆ ఇంట ముంగిట తెల్ల బోయెగ
బండ మీద ఇల్లు కట్టి
సాటి లేదని చాటి చెప్పి (2)
బండైన యేసు మీద నీ బ్రతుకు
ఇంటిని కట్టుకోవయ్యా
బండైన యేసు మీద నీ బ్రతుకు
ఇంటిని కట్టుకోవమ్మా
చావు వద్ద తీర్పు వద్ద
కూలి పోని కాలి పోని (2)
నిత్యం జీవం పొంద రావయ్యా
సజీవుడైన యేసు దేవుని స్వీకరించయ్యా
నిత్యం జీవం పొంద రావమ్మా సజీవుడైన యేసు దేవుని స్వీకరించమ్మా