చిన్న చిన్న జీవులు చిన్నారి జీవులు
చిట్టిపొట్టి కాళ్ళు చిన్న చిన్న రెక్కలు
అక్కడ ఇక్కడ మరెక్కడైన ఉండును
1. చిన్నవని చిన్న చూపు చూడకు
లెస్సైన జ్ఞానము వాటికున్నది ॥చిన్న॥
2. చీమ అని తక్కువగా ఎంచకు
సోమరికి నేర్పును గొప్ప పాఠము ॥చిన్న॥
3. బల్లి అని హీనముగా చూడకు
పట్టుదల లేని వానికదే పాఠము ॥చిన్న॥
4. మిడత అని హీనముగా చూడకు
క్రమశిక్షణ లేని వాని క్రియా పాఠము ॥చిన్న॥
5. చిన్న కుందేలని ఛీత్కారము చూపకు
రక్షణకు చూపునది భలే మార్గము ॥చిన్న॥