యేసయ్య ప్రేమతో
హృదయమంతా నిండెను
నా పాపమంతా కడిగి నన్నె మార్చెను
ల ల ల ల్లా లా లా లా లా ల ల
చెడు చూపులను చెడు మాటలను
చెడు క్రియలను చెడు స్నేహితులన్
యేసయ్య ప్రేమకై విడిచిపెట్టెదన్
యేసయ్య కృపలో నేను
ఎదుగుచుండెదన్
2. విశ్వాసముతో ప్రార్ధనలో
వాక్యముతో సహవాసములో
దిన దినము యేసులో
ఎదుగుచుండెదన్
యేసయ్య రాకకై ఎదురు చూచెదన్