జీవముగలవాడు నా దేవుడు
జీవించుచున్నవాడు
1. గుడ్డివాడు కాడు నా దేవుడు
నా క్రియలన్ చూచును
చెవిటివాడు కాడు నా దేవుడు
నా మొర వినుచుండును ॥జీవ॥
2. మూగవాడుకాడు నా దేవుడు
నాతో మాట్లాడును
కురుచకాదు మరి ఆయన హస్తము
నన్నిల రక్షించు
3. మనుషులు చేసిన
వట్టి విగ్రహం కాదు నా దేవుడు
ఆత్మ రూపిగ మాతో నుండి
మమ్మును కాపాడును