బంగారు నగరిలో నా కొరకు
ఇల్లు కట్టెను నా యేసు రాజు
సుందరమైన నగరం
రత్నాల రాశుల పరమపురం
1. తానుండె చోటుకు కొనిపోవుటకును
రానుండె నా యేసురాజు
బాధలు లేని నగరం
రోదన ఎరుగని పరమపురం
2. నీవును యేసుని అంగీకరించిన
కట్టును నీకు ఇల్లు
ఆకలి లేని నగరం
చీకటి కానని పరమపురం