చిరుచిరుప్రాయపు చిన్నారులం
బుడిబుడి నడకల బుజ్జాయిలం
యేసయ్య ప్రేమించిన బాలలం
యేసయ్య రాజ్యపు వారసులం
1. దేవుని వాక్యము ధ్యానించుతాం
విడువక నిత్యము ప్రార్ధించుతాం
దేవుని ప్రేమను చాటించుతాం
ఆయన కృపను పాడుతాం
2. అల్లరి చేయుట మేమెరుగం
తుంటరి పనులకు దరిచేరం
అమ్మానాన్నకు విధేయులం
అందరి దయకు పాత్రులం