విశాల నీలాకాశంలో
వింతైన అంతరిక్షంలో
ఎత్తైన పర్వత శ్రేణులలో
లోతైన పచ్చని లోయలలో (2)
దేవుని చేతిపని
ప్రచురమగుచున్నది
యేసుక్రీస్తు మహిమ
వివరించబడుచున్నది
1. మిలమిల మెరిసే తారలలో
కిలకిల అరిచే పక్షులలో
గలగల ఉరికే ఏరులలో
కళకళ వెలిగే చిన్నారులలో ॥దేవు ॥