చిన్న చిన్న పిల్లల
చిట్టి చిట్టి చేతులు
చిన్నతనపు అల్లరితో
ముద్దులొలుకు చుండును
ఆ చేతులకు మంచి పనులు
చేయుటను నేర్పింతమా
మన చేతులతో మంచితనపు
మార్గమందు నడిపింతమా
1. ఆ చేతులే బైబిలు పట్టి
ఎందరినో రక్షించవచ్చును
ఆ చేతులే తుపాకి పట్టి
విధ్వంశం సృష్టించవచ్చును
2. ఆ చేతులే పియాను మీద
సంగీతం పలికించవచ్చును
ఆ చేతులే మోసం చేసే
జూదపు చక్రం తిప్పవచ్చును
3. ఆ చేతులే కుష్టురోగుల
గాయాలను కట్టవచ్చును
ఆ చేతులే మత్తుమందులతో
నిలకడలేక వణకవచ్చును